తెలుగు సాహిత్యం

ఆ. తెలుఁగ దేల నన్న దేశంబు దెలుఁగేను
దెలుఁగు వల్లభుండఁ దెలుఁ గొకండ
యెల్ల నృపులు గొలువ నెఱుఁగ వే బాసాడి
దేశ భాషలందుఁ దెలుఁగు లెస్స

ఈ మాట ఆముక్తమాల్యదలో సాక్షాత్ శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణదేవరాయలతో నన్నమాట. అనగా ఇది భగవద్వాక్యం. ఇది నా మాతృ భాష కావటం నిజంగా ఎన్ని జన్మముల పుణ్యఫలమో. ఇలా వర్ణిస్తూ పోతే తెలుగు గురించి నిజానికి నాకు వర్ణించేశక్తిలేదు, కానీ ఉన్న శక్తికే వ్యక్తమవటానికి కొన్ని జన్మలు చాలవు. కాబట్టి ఇక్కడితో ఆపి, ఈ క్రింద కొన్ని గ్రంథాలనూ, కావ్యాలనూ పొందుపరుస్తాను. సహృదయులు చదివి ఆనందింతురుగాక.

కవిత్రయము వారి ఆంధ్రమహాభారతం

రంగనాథ రామాయణ ద్విపద కావ్యం

తెలుగుపుణ్యపేటి బమ్మెర పోతనగారి శ్రీమద్భాగవతం